లైవ్ వీడియో- 3 బైక్లపైకి దూసుకెళ్లిన SUV - బెంగళూరులో బైక్లను ఢీకొనిన కారు
🎬 Watch Now: Feature Video
Published : Nov 13, 2023, 1:33 PM IST
Car Accident In Bengaluru : అతివేగంగా వస్తున్న ఓ కారు మూడు బైక్లను ఢీకొనగా నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బెంగళూరులోని హుళిమావు సమీపంలో ఓ ఎస్యూవీ కారు అదపుతప్పి ముందు ఉన్న ఓ బైక్ను ఢీకొంది. అయినా ఆగకుండా అలానే మరో రెండు బైక్లను ఢీకొట్టుకుంటూ ముందుకు వెళ్లిపోయింది. ఈ దృశ్యాలను వెనుక వాహనంలో ఉన్న వారు రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. కారు డ్రైవర్ అభిషేక్ అగర్వాల్ కారుపై నియంత్రణ కొల్పోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అదుపుతప్పిన కారు ఢీ కొనడం వల్ల బైక్పై వెళ్తున్న ఇద్దురు వ్యక్తుల్లో ఒకరు కిందకు దూకేశారని.. మరో ముగ్గురు గాయపడ్డారు అని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.