Bus Accident In Muktsar : కాలువలో పడిన బస్సు.. 8 మంది మృతి.. అనేక మందికి గాయాలు - bus accident in punjab today

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Sep 19, 2023, 9:44 PM IST

Bus Accident In Muktsar Today : పంజాబ్​.. ముక్త్​సర్ సాహిబ్​ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వంతెనపై ప్రయాణిస్తున్న ఓ బస్సు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.  

ఇదీ జరిగింది.. 
శ్రీ ముక్త్​సర్​ సాహిబ్​ నుంచి మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఓ బస్సు బయలుదేరింది. భారీ వర్షంలో ముక్త్​సర్-కోటర్​పురా రహదారిపై ప్రయాణిస్తుండగా... బస్సు వారింగ్​ అనే గ్రామం సమీపంలో ఉన్న కెనాల్​ బ్రిడ్జి వద్దకు రాగానే.. అదుపుతప్పింది. బస్సు ఒక్కసారిగా కెనాల్​లో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మందికి గాయాలయ్యాయి. సమాచారం అదుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ ప్రమాదంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్​ మాన్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.