40 కేజీల బాహుబలి బర్గర్ ఎన్ని కిలోల సాస్ వాడారో తెలుసా - పంజాబ్ 40 కేజీల బర్గర్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 12, 2022, 11:37 AM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

పంజాబ్​లోని హోశియార్పుర్​కు చెందిన బర్గర్ చాచూ దేశంలోనే అతిపెద్ద బర్గర్ తయారు చేసి రికార్డు సృష్టించారు. 40 కేజీలకు పైగా బరువున్న బర్గర్​ను సిద్ధం చేసి వార్తల్లోకెక్కాడు. దేశంలోనే అతిపెద్ద బర్గర్ ఇదేనని చెబుతున్నాడు చాచూ. కొత్తది ఏదైనా చేయాలన్న ఆలోచనతో అతిపెద్ద బర్గర్ రూపొందించినట్లు చెప్పాడు చాచూ. ఈ బర్గర్ కోసం 12కేజీల బన్, దాదాపు ఏడు కేజీల కూరగాయలు, అంతే మొత్తంలో సాస్ ఉపయోగించాడు. కేజీ చీజ్​ను బర్గర్​లో వాడాడు. ఈ బాహుబలి బర్గర్​ను చూసేందుకు స్థానికులు, ఆహార ప్రియులు పోటెత్తారు. ఇదివరకు ఆరు భారీ బర్గర్లను తయారు చేశాడు చాచూ. నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా చాచూ బర్గర్ తయారు చేశాడని స్థానికులు చెబుతున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.