ఒక్కసారిగా కూలిన పాత భవనం పైకప్పు - ముగ్గురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం - చండీగఢ్​లో కూలిన నిర్మాణంలో పాత భవనం పై కప్పు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Dec 7, 2023, 2:35 PM IST

Building Roof Collapse In Chandigarh : ఓ పాత భవనం కూల్చివేత సమయంలో శ్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయలయ్యాయి. వారిలో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన పంజాబ్​లోని చండీగఢ్​లో జరిగింది. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.  

చంఢీగడ్​లోని సెక్టారు 18లోని పాత భవనాన్ని కూల్చివేసి కొత్తది నిర్మించేందుకు పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు నడుచుకుంటూ వస్తుండగా ఒక్కసారిగా భవనం శ్లాబ్ వాళ్లపై పడిపోయింది. అక్కడే ఉన్న కొంతమంది వెంటనే వాళ్లను శిథిలాల నుంచి పక్కకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు సెక్టార్​ 32లో ఉన్న ఓ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఓ మహిళ, మరో ఇద్దరు ఉన్నారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై భవనం యజమాని కుసుమ లత, కాంట్రాక్టర్ చంద్ర సహా మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.