రాష్ట్రంలో అభివృద్ధి చేసే పార్టీనే ప్రజలు ఎన్నుకుంటారు : జగదీశ్ రెడ్డి - బీఆర్ఎస్ మేనిఫెస్టో 2023
🎬 Watch Now: Feature Video
Published : Nov 23, 2023, 8:03 AM IST
BRS Minister Jagadish Reddy Interview : తాగు, సాగు నీరు లేక.. ఏళ్లుగా ఇబ్బందులు పడిన సూర్యాపేట ప్రజలు.. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఉపశమనం పొందారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా మరింత అభివృద్ధి చెందాలంటే మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావాలన్నారు. నియోజకవర్గంలోని గులాబీ పార్టీపై ప్రజల ఆదరణ ఉందని, తమ ప్రభుత్వం కొనసాగుతుందనే భావన ప్రజల్లో కనిపిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేసే పార్టీకే ప్రజలు ఓటేస్తారని, అందుకే బీఆర్ఎస్కు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు, అభివృద్ధి పనుల వల్లే నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని జగదీశ్ రెడ్డి అన్నారు. మెడికల్ కళాశాల నిర్మించామని, కార్పొరేట్ స్థాయికి దీటుగా త్వరలో గురుకుల పాఠశాల కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే నియోజకవర్గంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ఐటీ టవర్, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్న జగదీశ్ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.