బట్టతలను దాచి రెండో పెళ్లికి యత్నం.. విగ్గు తీసి చితకబాదిన వధువు బంధువులు - బిహార్ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
బిహార్ గయాలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన ఓ వ్యక్తి.. తనకు బట్టతల ఉందన్న విషయాన్ని దాచి.. విగ్గు ధరించి పెళ్లి మండపానికి వచ్చాడు. కొద్ది సేపట్లో పెళ్లి అవుతుందన్న సమయంలో ఈ విషయం వధువు బంధువులకు తెలియడం వల్ల అతడిని చితకబాదారు.
ఇదీ జరిగింది
డోభీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బజౌరా గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి అంతకుముందే వివాహం జరిగింది. అయితే తాజాగా మరో అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. బట్టతల ఉన్న అతడు.. విగ్గుతో పెళ్లి మండపానికి వచ్చాడు. కొద్ది సేపట్లో పెళ్లి అవుతుందన్న సమయంలో.. వధువు బంధువులకు అనుమానం వచ్చింది. దీంతో అతడిని పరీక్షించగా.. అతడికి ఇది రెండో పెళ్లని.. విగ్గు ధరించి వివాహానికి వచ్చాడని తెలిసింది. ఆగ్రహించిన వధువు బంధువులు.. అతడిని చితకబాదారు. తాను చేసింది తప్పే.. వదిలేయాలంటూ నిందితుడు ప్రాధేయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి భార్య ఘటనా స్థలానికి వచ్చింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయంలో జోక్యం చేసుకున్న గ్రామస్థులు.. పంచాయితీ పెట్టి సమస్యను పరిష్కరించారు.