ఒకేసారి వికసించిన రెండు బ్రహ్మ కమలాలు - చూసేందుకు ఆసక్తి చూపిన ప్రజలు - Blooming Brahma Lotus
🎬 Watch Now: Feature Video


Published : Jan 6, 2024, 2:20 PM IST
Blooming Brahma Lotus In Nizamabad : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాయత్రి నగర్ ప్రాంతంలో అరుదైన బ్రహ్మ కమలాలు పూసాయి. గాయత్రి నగర్లో నివాసం ఉంటున్న బొడ్డు శ్రీనివాస్, రమ దంపతుల ఇంట్లో పెంచుకున్న చెట్టుకు ఒకే సారి రెండు బ్రహ్మ కమలాలు వికసించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. వికసించిన కొద్ది గంటల్లోనే ముడుచుకుపోవటం ఈ బ్రహ్మ కమలం ప్రత్యేకత. శివుడికి ఎంతో ఇష్టమైన ఈ బ్రహ్మ కమలాలు శివుని అనుగ్రహంతోనే వికసిస్తాయనే నమ్మకంతో వాటికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాలనీలోని ప్రజలందరూ ఈ బ్రహ్మ కమలాలను ఆసక్తిగా వీక్షించారు.
Brahma Lotus : బద్రీనాథ్ పుణ్యక్షేత్రంలో విష్ణువు, కేదార్నాథ్ ఆలయంలో శివునికి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ బ్రహ్మ కమలాలను సమర్పిస్తారు. భారతీయ సంప్రదాయంలో బ్రహ్మ కమలాన్ని ఇంటికి అదృష్టం, శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. ఈ మొక్కను ఇంట్లో ఉంచడం వల్ల ప్రతికూల శక్తులు దూరం అవుతాయని భక్తుల విశ్వాసం. బ్రహ్మ కమలాన్ని హిందూ మతంలో ముఖ్యమైన ఆధ్యాత్మికత కల్గిన ఈ పుష్పానికి కోరికలు తీర్చే శక్తి ఉందని నమ్ముతారు.