BJP Supports TSRTC Bill : "ఆర్టీసీ బిల్లును బీజేపీ స్వాగతిస్తోంది.. మాపై అసత్య ప్రచారాలొద్దు" - Etala Rajender Latest News
🎬 Watch Now: Feature Video
BJP Supports TSRTC Bill : ఆర్టీసీని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేరని గతంలో చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడాన్ని బీజేపీ స్వాగతిస్తుందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఆర్టీసీ విలీనం బీజేపీ పార్టీకి ఇష్టం లేనట్లుగా బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ బిల్లు విషయంలో.. గవర్నర్ అందుబాటులో లేరని చెప్పారని.. కావాలని బట్ట కాల్చి గవర్నర్ మీద వేస్తున్నారని విమర్శించారు. బలవంతంగా ఆర్టీసీ ఉద్యోగులను బస్సులో ఎక్కించి రాజ్‌భవన్‌కు పంపతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు ఎంతో చైతన్యవంతులని.. నిజనిజాలు వారికి తెలుసన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఆర్టీసీ ఉద్యోగులకు రెండు పీఆర్‌సీలు బాకీ ఉన్నాయని గుర్తు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. సంబంధిత బిల్లుపై సందేహాలు వ్యక్తం చేస్తూ గవర్నర్ తమిళిసై.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి లేఖ రాశారు.