BJP rally on Approve Women Reservation Bill : 'మహిళా రిజర్వేషన్‌పై విపక్షాలు 75 ఏళ్లుగా ఆలోచిస్తూనే ఉన్నాయి' - BJP rally on Womens Reservation Bill
🎬 Watch Now: Feature Video
Published : Sep 24, 2023, 7:52 PM IST
BJP rally on Approve Women Reservation Bill in Hyderabad : హైదరాబాద్‌లో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ( Women Reservation Bill) ఆమోదం సందర్భంగా.. ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతూ దీనిని చేపట్టారు. గన్‌పార్క్ నుంచి నాంపల్లిలోని పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, సినీనటులు జయసుధ, జీవిత, కవిత, మహిళా కార్పొరేటర్లు పాల్గొన్నారు.
కేసీఆర్ గురువు అసదుద్దీన్ ఓవైసీ అని కిషన్‌రెడ్డి (Kishan Reddy) పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్‌పై విపక్షాలు 75 సంవత్సరాలుగా ఆలోచిస్తూనే ఉన్నాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలన మహిళలను వెనుకబాటుకు గురిచేసిందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో చాలా సంవత్సరాలు ఒక్క మహిళా మంత్రి లేరని ఆరోపించారు. మజ్లిస్ మాత్రమే మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మహిళలకు అన్ని హక్కులు కల్పించేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. ఒక్క కుంభకోణం లేకుండా మోదీ పదేళ్లు పాలించారని వివరించారు. మీరందరూ ప్రధాని నాయకత్వాన్ని ఆశీర్వదించాలని కిషన్‌రెడ్డి కోరారు.