అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఎందుకు ఓడించారో ఆలోచించాలి : బండి సంజయ్‌ - ఆర్యవైశ్య కార్పొరేషన్​ గురించి బండి సంజయ్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Dec 25, 2023, 10:59 PM IST

BJP MP Bandi Sanjay about Elections Result : ఎక్కడా అవినీతికి పాల్పడకుండా నిస్వార్థంగా ప్రజల కోసం పని చేస్తున్న తనను ఎందుకు ఓడించారో, దీనికి కారణమెవరో హిందువులంతా ఆలోచించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో హిందూ సంఘటిత శక్తిని చాటాలని ఆయన ప్రజలను కోరారు. కరీంనగర్​లోని వైశ్య భవన్​లో జరిగిన ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్ష, కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బండి సంజయ్ హాజరయ్యారు. హిందూ సమాజం కోసం పని చేసేవాళ్లు ఆర్యవైశ్యులేనని అన్నారు. వారంతా తనకు ఎల్లప్పుడూ అండగా ఉన్నారని సంజయ్​ పేర్కొన్నారు.

BJP Leader Bandi Sanjay in Karimnagar : బీజేపీ అధికారంలోకి వస్తే ఆర్యవైశ్య కార్పొరేషన్​ను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని, కానీ తాము అధికారంలోకి రాలేకపోయామని ఎంపీ బండి సంజయ్​ తెలిపారు. కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల్లో ఎంతో మంది పేదలున్నారని చెప్పారు. వారికి ఆర్థికంగా, విద్యాపరంగా చేయూత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.