BJP Leaders Protest Of BRS MLA Hanumanth Shinde House : ఎమ్మెల్యే హన్మంత్ షిండే నివాసం ముట్టడికి బీజేపీ నాయకుల యత్నం.. - telangana latest news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-08-2023/640-480-19338873-thumbnail-16x9-bjp--leaders--protest--of--brs-mla--hanumanth--shinde--house.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Aug 23, 2023, 7:42 PM IST
BJP Leaders Protest Of BRS MLA Hanumanth Shinde House : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఎమ్మెల్యే హన్మంత్ షిండే నివాసం ముట్టడికి బీజేపీ, బీజేవైఎం నాయకులు యత్నించారు. దీంతో ఎమ్మెల్యే నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే ఒక్కసారిగా తన అనుచరులతో ఇంట్లో నుంచి బయటకు రావడంతో ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే అనుచరులు తమపై కర్రలతో దాడి చేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని పేద ప్రజలకి రెండు పడక గదుల ఇండ్లు ఇప్పటకీ ఇవ్వలేదని విమర్శించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరించారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలు గమనిస్తున్నారని ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదని బీజేపీ నాయకులు ఆరోపించారు. పిట్లం ఎంపీపీ భర్త విజయ్ బీజేపీ కార్యకర్తను కాలుతో తన్నుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ఆ పార్టీ నాయకులు వాపోయారు.