Etela fires on BRS : "సమైక్య పాలకులకు ఉన్న సోయి.. తెలంగాణ పాలకులకు లేదు" - KCR
🎬 Watch Now: Feature Video
Etela fires on BRS : సమైక్య పాలకులకు ఉన్న సోయి తెలంగాణ పాలకులకు లేదని బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. గతంలో ఒక్క సభ్యుడు ఉన్నా బీఏసీకి పిలిచేవారని.. బీజేపీ నుంచి ముగ్గురు సభ్యులు ఉన్నప్పటికీ బీఏసీకి పిలవలేదని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో చాలా గదులు ఖాళీగా ఉన్నా.. తమకు గది కేటాయించడంలేదని అగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఉదయం స్పీకర్‌కు ఫోన్ చేసి అడిగినా సమాధానం లేదన్నారు. ప్రజాసమస్యలపై అసెంబ్లీలో చర్చించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. అందుకే సభను మూడ్రోజుల పాటు జరిపి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయని చర్చ చేయాల్సి అవసరం ఉందని ఈటల తెలిపారు. వర్షాలకు పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను మభ్యపెట్టేందుకే ప్రభుత్వంలో విలీన ప్రకటన చేశారని దుయ్యబట్టారు. ఏ మంత్రి కూడా సొంతంగా నిర్ణయం తీసుకునే పరిస్థితిలేదన్నారు. నాలుగేళ్లుగా చేయని రుణమాఫీని ఈ రెండు నెలల్లో చేస్తారా..? అని చూడాలన్నారు.