Boora Narsaiah Goud fires on KCR : "కేసీఆర్ డీఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉంది" - Telangana latest news
🎬 Watch Now: Feature Video
BJP leader Boora Narsaiah Goud fires on KCR : ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలపై కక్ష పెంచుకున్నారని బీజేపీ సీనియర్ నేత బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. కేసీఆర్ డీఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉందని విమర్శించారు. తొమ్మిదేళ్లు బీసీల సంక్షేమం, అభివృద్ధిని మరిచారని.. తెలంగాణలో 15 లక్షల కుటుంబాలు అత్యంత పేదరికంలో ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికలు వస్తున్నాయని లక్ష.. బిక్ష అనే పథకం పెట్టారని ఎద్దేవా చేశారు. తెలంగాణ బీసీ మంత్రులు కేసీఆర్ జపం చేస్తారని దుయ్యబట్టారు. లక్ష రూపాయల కోసం 5 లక్షల 63వేల దరఖాస్తులు చేసుకున్నారని చెప్పారు. దీని కోసం పది వేల కోట్లు అవసరమైతే కేవలం వంద కోట్లే కేటాయించారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం మొత్తం రాజ్యమేలినా లక్ష బిక్ష అమలు కాదన్నారు. ఇతర వర్గాలకు పది లక్షలు ఇచ్చి.. బీసీలకు లక్ష రూపాయలే ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికీ బీసీల మీద ప్రేమ ఉంటే బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు.