Bike Truck Collision Viral Video : బైక్‌ను ఢీకొన్న ట్రక్.. ట్రాఫిక్ పోలీస్ అలర్ట్.. లక్కీగా ముగ్గురూ.. - ఉత్తరాఖండ్ రోడ్డు ప్రమాదం
🎬 Watch Now: Feature Video


Published : Sep 7, 2023, 9:24 PM IST
Bike Truck Collision Viral Video : రోడ్డు మీద వెళ్తున్న బైక్‌ను ఓ ట్రక్కు ఢీకొన్న సమయంలో.. ట్రాఫిక్ పోలీస్ అప్రమత్తత వల్ల త్రుటిలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారు. ఉత్తరాఖండ్ రాజధాని దెహ్రాదూన్‌లో ఈ ఘటన జరిగింది. త్రుటిలో తప్పిన ఈ పెను ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అసలేం జరిగిందంటే?
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా దెహ్రాదూన్‌లోని రిస్పానా వంతెన వద్ద ఏర్పడిన ట్రాఫిక్‌ను.. బుధవారం ఉదయం పోలీసులు మళ్లిస్తున్నారు. అదే సమయంలో పాత బైపాస్ చౌక్ నుంచి రిస్పానా వంతెన వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టింది. ఘటనా సమయంలో బైక్‌పై ముగ్గురు ప్రయాణిస్తున్నారు. అందులో ఓ మహిళ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ట్రక్కు ఢీకొన్న వెంటనే ద్విచక్రవాహనంపై ఉన్న ముగ్గురూ కిందపడిపోయారు.
అక్కడే ఉన్న ఓ ట్రాఫిక్ పోలీస్.. ట్రక్కు ఢీకొట్టడాన్ని గమనించారు. అప్రమత్తమై వెంటనే ట్రక్కు ఆపాలని సిగ్నల్ ఇచ్చారు. కాస్త ట్రక్కును వెనక్కి పోనిచ్చారు. దీంతో ముగ్గురు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు.. స్థానికంగా ఉన్న సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి. అయితే నిమిషం ఆలస్యమైనా ముగ్గురు పైనుంచి ట్రక్కు వెళ్లపోయేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని పోలీసులు కోరుతున్నారు.