Bhatti Vikramarka about YS Rajasekhar Reddy : వైఎస్సార్ మాట తప్పని మహా నాయకుడు: భట్టి విక్రమార్క - భట్టి విక్రమార్క ప్రెస్మీట్
🎬 Watch Now: Feature Video


Published : Sep 2, 2023, 6:40 PM IST
Bhatti Vikramarka about YS Rajasekhar Reddy : దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతు పక్షపాతి అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కొనియాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులర్పించారు. ఈ మేరకు హైదరాబాద్లోని గాంధీభవన్లో కాంగ్రెస్ ప్రముఖ నాయకులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇస్తుందని ప్రచారం చేసుకుంటుందని.. కాని దానికి పేటెంట్ హక్కు వైఎస్ఆర్దేనని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఎన్నో సేవలు చేశారని తెలిపారు.
YS Rajasekhar Reddy Death Anniversary Telangana : విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్, ప్రజలకు వైద్య సదుపాయం అందించేందుకు ఆ రోజుల్లోనే ఆరోగ్య శ్రీ తీసుకువచ్చారని అన్నారు. వాటన్నింటికీ పేటెంట్ హక్కు వైఎస్ఆర్దేనని పేర్కొన్నారు. వాటితో పాటు ముస్లింల కోసం 4 శాతం రిజర్వేషన్, మహిళలకు పావలా వడ్డీ, రైతుల కోసం రుణమాఫీ పథకాలు తెచ్చిన ఘనత ఆయనదేనని కొనియాడారు. మాట తప్పని మహానాయకుడని వ్యాఖ్యానించారు. ఆయన ప్రభుత్వంలో ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశారని.. వాటిని తలచుకుంటే మంచి అనుభూతిని ఇస్తోందని హర్షం వ్యక్తం చేశారు.