భద్రాద్రిలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు - వరాహ అవతారంలో దర్శనమిచ్చిన రామయ్య - భద్రాద్రి రామయ్య వరాహ అవతారం
🎬 Watch Now: Feature Video


Published : Dec 15, 2023, 7:08 PM IST
Bhadradri Vaikunta Ekadashi Utsavalu : భద్రాద్రి రామయ్య శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దశవతారల్లో భాగంగా నేడు రఘురాముడు వరాహ అవతారంలో దర్శనమిచ్చారు. ఈ అవతారంలో ఉన్న స్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించన అర్చకులు అనంతరం బజారు సేవ ఘనంగా నిర్వహించారు. కోలాట నృత్యాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల సకస రాజ లాంఛనాల నడువ స్వామివారిని తిరు వీధుల్లో ఊరేగించారు.
Bhadradri Ramayya Mukkoti Utsavalu : భక్తుల కోలాహల సందడి నడుమ ఊరేగుతున్న స్వామివారికి తిరు వీధుల్లో భక్తులు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. పట్టణ పురవీధుల్లో విహారిస్తున్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో మిథిలా స్టేడియం వద్దకు వచ్చారు. ఉత్సవాల్లో నాలుగో రోజు సందర్భంగా రేపు స్వామివారు నరసింహ అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఏటా నిర్వహించే ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు.