Bandi Sanjay as BJP National General Secretary : జాతీయ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టిన బండి సంజయ్ - Bandi Sanjay as BJP National General Secretary
🎬 Watch Now: Feature Video

Bandi Sanjay takes charge as BJP National General Secretary: దిల్లీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా.. బండి సంజయ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. అధిష్ఠానం తనపై పెట్టిన బాధ్యతను నమ్మకంతో పనిచేసి.. పార్టీని శక్తివంతంగా తయారు చేస్తానని వెల్లడించారు. తెలంగాణలో జరుగుతున్న నిరంకుశ పాలనకు అడ్డుకట్ట వేసి.. మోదీ రాజ్యస్థాపనకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నేతలు బండి సంజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
బీజేపీని మరింత పటిష్ఠం చేసే దిశగా ఆ పార్టీ జాతీయ అధినాయకత్వం పార్టీలో పలుమార్పులు చేపట్టింది. ముఖ్యంగా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పార్టీలో స్వల్ప మార్పులు చేసింది. బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ని తొలగించి.. కిషన్ రెడ్డికి పదవీ బాధ్యతలను అప్పగించింది. అనంతరం బండి సంజయ్‌ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. గురువారం రోజున బండి సంజయ్ కుటుంబ సభ్యులతో కలిసి నరేంద్ర మోదీని కలిశారు. తెలంగాణలో బీజేపీ బలోపేతం కోసం ఎంతగానో శ్రమించారని బండి సంజయ్‌ని.. మోదీ అభినందించారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో మరింతగా కష్టపడాలని సూచించారు.