Bandi Sanjay Latest Comments on KTR : కేటీఆర్‌ని సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలి : బండి సంజయ్ - బండి సంజయ్ కామెంట్స్
🎬 Watch Now: Feature Video

Bandi Sanjay Fire on KTR : అసెంబ్లీలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మాట్లాడుతున్న తీరు, అహంకారాన్ని చూసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలే చీదరించుకొనే పరిస్థితి నెలకొందన్నారు. అందవల్లనే కేటీఆర్‌ను సీఎం అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించడం లేదన్నారు. దమ్ముంటే ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమారుడు సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలా ప్రకటిస్తే పార్టీలో ఒక్కరు కూడా మిగలరని జోస్యం చెప్పారు. కరీంనగర్ రైల్వేస్టేషన్ ఆధునీకీకరణ పనులకు ఆయన హాజరయ్యారు. ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తున్న కార్యక్రమానికి ఆర్డీఓ తప్ప జిల్లా స్థాయి అధికారి రాలేదని బండి సంజయ్ విమర్శించారు. అసెంబ్లీలో రాజాసింగ్‌ను చూస్తేనే కేటీఆర్‌కు వణుకు పుడుతోందన్నారు. గోషామహల్లో రాజాసింగ్‌పై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. రాజాసింగ్ బీజేపీ నాయకుడు కాకపోయినా ధర్మం కోసం పనిచేసే వ్యక్తి అని బండి సంజయ్ స్పష్టం చేశారు.