బీజేపీ అధికారంలోకి వస్తే ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్ జైలుకి వెళ్లేవారు : బండి సంజయ్ - BJP Leader Bandi Sanjay
🎬 Watch Now: Feature Video
Published : Jan 11, 2024, 3:49 PM IST
Bandi Sanjay Fires on KCR and KTR : బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తుందో తనకు అర్థం కావడం లేదని బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారని బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే మాత్రం, ఇప్పటికే విచారణ పూర్తి చేసి కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌ను జైల్లో పెట్టే వారిమని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ తీగలగుట్టపల్లిలో నిర్మాణంలో ఉన్న ఆరోబి వంతెనతో పాటు కరీంనగర్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులను బండి సంజయ్ అధికారులతో కలిసి పరిశీలించారు.
Bandi Sanjay Inspect Karimnagar Railway Station : సేతు బంధు పథకంలో భాగంగా ఆరోబీ నిర్మాణ పనులు, అమృత్ భారత్ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని బీజేపీ ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను భూసేకరణ సాకుతో తాత్సారం చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ రక్తం చిందించారని చెప్పుకోవడం సిగ్గు చేటని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ నియంతృత్వ పాలనను పారద్రోలడానికి బీజేపీ కార్యకర్తలు రక్తాన్ని చిందించారని నాటి విషయాలను బీజేపీ నేత బండి సంజయ్ గుర్తు చేశారు.