Bandi Sanajay comments on CM KCR : 'ధరణి బాధితులతో.. సభ నిర్వహిస్తే పరేడ్‌గ్రౌండ్ నిండిపోతుంది' - కరీంనగర్ జిల్లా చైతన్యగిరిలో బండి సంజయ్
🎬 Watch Now: Feature Video
BJP door to door campaign in Karimnagar : రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ ప్రచారం కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. దాదాపు రెండుగంటల్లో పదిలక్షల మందిని బీజేపీ కార్యకర్తలు కలుసుకొని కేంద్రప్రభుత్వం చేపడుతున్న పథకాలను వివరించారని తెలిపారు. కరీంనగర్ లోని చైతన్యపురి 173వ పోలింగ్ బూత్ పరిధిలో.. బండి సంజయ్ ప్రజలను కలుసుకొని మోదీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఇంటింటికి బీజేపీ స్టికర్లు అందిచడమే కాకుండా కరపత్రాలను పంపిణీ చేశారు. బీజేపీ సంక్షేమ కార్యక్రమాలను వివరించడమే కాకుండా రాష్ట్రప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ప్రజలకు వివరిస్తామని బండి సంజయ్ వెల్లడించారు.
ధరణి ఎంతో మంచి పథకమైనా.. భూ బాధితులతో సభ ఏర్పాటు చేస్తే పరేడ్‌గ్రౌండ్‌లో పెద్ద సభే అవుతుందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఈ పథకాన్ని కేసీఆర్ పూర్తిగా తన కుటుంబ అవసరాలకు ఉపయోగించుకున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేసినా డబ్బు ఇవ్వలేదు.. పంట నష్టానికి పరిహారం ఇస్తానని చెప్పిన సీఎం ఇంత వరకు ఆ పైసలు ఇవ్వలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లను ప్రజలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.సరిపోకపోతే మరో 5 లక్షల ఇండ్లను తీసుకు రావడానికి తాను సిద్దమని పేర్కొన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో మొదటి విడతగా ముప్పై మంది అభ్యర్థులను ఎంచుకుకొని.. వారికి కేసీఆర్ ఫండింగ్ ఇస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో వాళ్లు గెలిస్తే బీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో ఉన్న వాళ్లంతా తమవాళ్లేనని కేసీఆర్ అనుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు.