Bakrid Festival Telangana : రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బక్రీద్ పర్వదిన వేడుకలు - Bakrid Festival in Telangana
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-06-2023/640-480-18873593-62-18873593-1688028907848.jpg)
Bakrid Festival 2023 : రాష్ట్రవ్యాప్తంగా బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ మీరాలం ఈద్గా వద్ద ముస్లింలు పెద్ద సంఖ్యలో ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా.. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్లో బక్రీద్ పండుగను పురస్కరించుకుని.. ముస్లింలు భక్తి శ్రద్దల నడుమ ఈద్గా మైదానంలో ప్రత్యేక ప్రార్థననలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈద్గా వద్దకు చేరుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
బక్రీద్ త్యాగాలకు ప్రతీకగా నిలుస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సంతోషాన్ని జనులందరికి సమానంగా అందించినపుడే సార్థకత చేకూరుతుందనే సందేశాన్ని ఈ పండుగ తెలుపుతుందని చెప్పారు. బక్రీద్ సందర్భంగా ముస్లింలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. మహబూబ్నగర్ కొత్తగంజి సమీపంలోని ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. వరంగల్, హనుమకొండ, కాజీపేట తదితర ప్రాంతాల్లో ముస్లిం సోదరులు పలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసి పరస్పర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.