Badrinath Temple Telangana : తెలంగాణలో బద్రీనాథ్ ఆలయం.. ఎక్కడుందో తెలుసా..? - తెలంగాణ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Badrinath Temple Siddipet : ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ దేవాలయాన్ని పోలిన క్షేత్రాన్ని సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండమైలారంలో నిర్మించారు. మంచు కొండల్లో కొలువుదీరి ఆరు నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే బద్రీనాథ్‌ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని ఎంతోమంది భక్తులు కలలు కంటుంటారు. ఆర్థిక స్తోమత గల వారు బద్రీనాథ్ వెళ్లి స్వామివారిని నేరుగా దర్శించుకుంటారు. కానీ ఆర్థిక పరిస్థితి సరిగా లేని వారికోసం ఓ సంస్థ బద్రీనాథ్ దేవాలయాన్ని పోలిన కోవెలను సిద్దిపేటలో నిర్మించింది. సహజంగా బద్రీనాథ్ ఆలయానికి వెళ్లడం కాస్త కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఆలయం 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. మరో ఆరు నెలలు మంచు ఎక్కువగా ఉండటంతో ఆలయాన్ని మూసేస్తారు. అక్కడ కొలువైన మహావిష్ణువును పూజించాలంటే ఒక విధంగా సాహస యాత్ర చేయాల్సిందే. ఈ ఆలయం జూన్ నెలలో ప్రారంభం కావడంతో ఇక్కడికి వచ్చే భక్తులు బద్రీనాథ్ క్షేత్రాన్ని చూసి ఆనందాన్ని పొందుతున్నారు. ఈ ఆలయంలో పూజలు నిర్వహించే వేద పండితులు సైతం బద్రీనాథ్ నుంచి రావడం విశేషం.