తెరుచుకున్న బద్రీనాథ్​ ఆలయం.. భారీగా హాజరైన జనం - చార్​ధామ్​ యాత్ర 2022

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 8, 2022, 8:09 AM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

Badrinath temple opening: ఉత్తరాఖండ్​లోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన బద్రీనాథ్​​ ఆలయం సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి తెరుచుకుంది. ఆదివారం ఉదయం 6.15 గంటలకు వేద మంత్రాల మధ్య తలుపులు తెరిచారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఆలయం తలుపులు తెరిచాక.. బద్రీనాథుడికి తాపడంగా చేసిన నెయ్యిని పంచిపెట్టారు. బద్రీనాథుడి ఆలయంతో పాటు సుభాయ్​ గ్రామంలోని భవిష్య బద్రి ధామ్​ ఆలయ తలుపులు తెరిచారు. కుబేరుడి డోలీ శనివారం రాత్రి బామణి గ్రామానికి చేరుకుంది. ఆదివారం ఉదయం 5 గంటలకు బద్రీనాథుడి ఆలయానికి తీసుకొచ్చారు. బద్రీనాథ్​-కేదార్​నాథ్​ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్​, ఉపాధ్యక్షుడు కిశోర్​ పన్వార్​, మాజీ ఎమ్మెల్యే మహేంద్ర భట్​ సహా ప్రముఖులు హాజరయ్యారు. ఆలయాన్ని 15 క్వింటాళ్ల వివిధ రకాల పూలతో అలంకరించారు. చార్​ధామ్​ యాత్రలో భాగమైన గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఈనెల 3వ తేదీన, కేదార్​నాథ్​ ఆలయం ఈనెల 6వ తేదీనే తెరుచుకున్నాయి.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.