Heroine Vaishnavi Chaitanya Interview : పాత'బస్తీ' నుంచి.. వెండితెర 'బేబీ' వరకు - బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య లేటెస్ట్ ఇంటర్వ్యూ
🎬 Watch Now: Feature Video
Baby Movie Heroine Vaishnavi Chaitanya Interview : యూట్యూబ్‌లో వీడియోలు చేసుకునే అమ్మాయి.. సినిమాలో మెయిన్ లీడ్ ఏం చేస్తుంది..? సోషల్ మీడియాలో రీల్స్ చేసుకునే తనకు అసలు సినిమాలెందుకు..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఆ అమ్మాయిని ఎనిమిదేళ్లుగా వెంటాడాయి. చివరకు ఆ ప్రశ్నలే తనను ఓ విధంగా అభద్రతా భావంలోకి నెట్టాయి. అయినా ఆమె వాటిని లెక్కచేయలేదు. తనకంటూ ఓ రోజు వస్తుందనే ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగింది ఆ తెలుగమ్మాయి. ఫలితంగా నేడు వెండితెరపై కథానాయికగా అవకాశాన్ని అందుకుని.. తనవైపు వేలెత్తి చూపించిన వారికి సమాధానంగా నిలుస్తోంది. తనే హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వైష్ణవి చైతన్య. లఘు చిత్రాల ద్వారా ప్రతిభను చాటుకుని... ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన బేబీ చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయం అయింది. సినిమా రంగంలో తెలుగు అమ్మాయిలకు భవిష్యత్ ఎక్కడ అనే వారికి తానే ఉదాహరణగా నిలుస్తానంటోన్న వైష్ణవితో ఈటీవీ భారత్ స్పెషల్ చిట్‌చాట్..