Awareness on Breast Cancer In Hyderabad : 'రొమ్ము క్యాన్సర్​పై అపోహలు వీడాలి.. జాగ్రత్తగా ఉండాలి'.. చిత్రాలేఅవుట్​లో అవగాహన కార్యక్రమం - Hyderabad latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Nov 1, 2023, 9:38 AM IST

Awareness on Breast Cancer In Hyderabad : హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని చిత్రా లేఅవుట్ కాలనీలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు కాలనీ ప్రవేశద్వారం నుంచి కమిటీహాల్ వరకు సాయంకాలపు నడకను చేపట్టారు. చిత్రాలేఅవుట్ కాలనీ అసోసియేషన్, కిరణ్ క్యాన్సర్ కేర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. కాలనీ వాసులు పెద్దఎత్తున పాల్గొన్నారు. అందరికీ రొమ్ము క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించారు. 

గ్రామీణ ప్రాంతాలే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో మంది మహిళలకు క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించేందుకు ఈ ప్రచారం విస్తృతంగా జరగాలని  కాలనీ వాసులు అన్నారు. సమాజంలో అత్యంత భయంకరమైన వ్యాధిలో క్యాన్సర్‌ ఒకటి.. ఈ వ్యాధి పట్ల ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. గతంలో బ్రెస్ట్ క్యాన్సర్‌ కేవలం వయస్సు పైబడిన వారికే వచ్చేదని.. ప్రస్తుతం యువతులకూ ఈ వ్యాధి వస్తోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి కుటుంబంలోని అమ్మాయిలు సంవత్సరానికి ఒకసారైనా వైద్య పరీక్షలు చేయించుకోవాలని వారు సూచించారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.