Atlanta Telugu People on Chandrababu Arrest : 'న్యాయం గెలవాలి.. చంద్రబాబు బయటకు రావాలి' - chandrababu arrest update
🎬 Watch Now: Feature Video
Published : Sep 24, 2023, 5:42 PM IST
Atlanta Telugu People on Chandrababu Arrest : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్‌కి వ్యతిరేకంగా వివిధ దేశాల నుంచి నిరసలు వెలువెత్తుతున్నాయి. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల నుంచి నిరసన జ్వాలలతో పాటు.. టీడీపీ కార్యకర్తలు(TDP Followers) మద్దతు ప్రకటిస్తున్నారు. చంద్రబాబుకి తాము ఉన్నామంటూ ఎన్నారైలు భరోసా ఇస్తున్నారు. తాజాగా అమెరికాలోని అట్లాంటాలో ఉన్న తెలుగువారు చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు.
Atlanta Telugu Peoples on Chandrababu Arrest : తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు అరెస్టుకి నిరసనగా అట్లాంటాలోని తెలుగు వారు గళం విప్పారు. 'మేము సైతం బాబు కోసం' అంటూ ఫ్లెక్సీలు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ఎన్నారైలు హాజరయ్యారు. తక్షణమే చంద్రబాబుని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం గెలవాలి.. సీబీఎన్ బయటకు రావాలని నినాదాలతో హోరెత్తించారు. బాబు ఎలాంటి తప్పు చేయలేదని.. ఏపీ ప్రభుత్వం కక్ష్యపూరితంగా ఈ కేసు పెట్టిందని పలువురు ఎన్నారైలు తెలిపారు.