బాలికపై విచక్షణరహితంగా దాడి చేసిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ - కేసు నమోదు చేసిన పోలీసులు - Assistant Public Prosecutor assaulted minor girl

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2023, 12:35 PM IST

Assistant Public Prosecutor Attack on Girl: అనంతపురం నగరంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఉరవకొండ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్​గా (Assistant Public Prosecutor) విధులు నిర్వహిస్తున్న వసంతలక్ష్మి.. తన కుమారుడి సంరక్షణ బాధ్యతలు చూసుకునే బాలికపై విచక్షణరహితంగా దాడి చేశారు. ఈ దాడిలో బాలిక స్పృహ కోల్పోయి పడిపోయింది. దీనిని గమనించిన స్థానికులు బాలికను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి గోరంట్లలో ఉన్న తల్లికి సమాచారం ఇచ్చారు. 

ఆసుపత్రికి చేరుకున్న బాలిక తల్లి.. తన కుమార్తెకు ఏమైందో తెలియక అయోమయంలో పడింది. ఇవాళ బాలిక స్పృహలోకి వచ్చింది. తన కుమార్తెను తీవ్రంగా కొట్టి.. బాత్రూంలోకి నెట్టి గడివేశారని తల్లి వాపోయారు. ప్రస్తుతం అమ్మాయి ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉంది. కాళ్లు, చేతులు, శరీరంపై పలుచోట్ల గాయాలున్నాయి. దీంతో బాధితురాలి తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ధరణి కిషోర్ తెలిపారు. స్పృహలోకి వచ్చినప్పటి నుంచి బాలిక ఎవర్ని చూసినా భయాందోళనకు గురై గజగజ వణికి పోతోంది. తన కుమార్తెకు చట్టపరంగా న్యాయం చేయాలని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.