'రాష్ట్రంలో ఇస్తున్న పథకాలు మరే ప్రభుత్వం ఇవ్వడం లేదు' - brs government schemes
🎬 Watch Now: Feature Video
Published : Nov 6, 2023, 8:40 PM IST
Armoor BRS Candidate Jeevan Reddy Comments : శాసన సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తానని ఆర్మూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆర్మూర్‌లో కారు జోరు ఈసారి కూడా ఉంటుందని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు అందిస్తున్న బీఆర్ఎస్ పార్టీనే ప్రజలు ఎన్నుకుంటారని అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన మొదటి జిల్లా నిజామాబాద్ అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్న పథకాలు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంలేదని అన్నారు.
Jeevan Reddy About BRS : రైతు బంధు, దళిత బంధు,సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత తమ పార్టీదేనని జీవన్‌రెడ్డి అన్నారు. రైతుల కోసం ఇరవై నాలుగు గంటలు కరెంటు అందిస్తున్నామని తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇరవై నాలుగు కరెంటు ఇస్తుందా అని ప్రశ్నించారు. ఆర్మూర్ నియోజకవర్గం కోసం రూ.4 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కేవలం ఆర్మూర్ అభివృద్ధి పనులకు రూ. 170 కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. రాష్ట్రంలో అన్నీవర్గాలకు తమ ప్రభుత్వం అండగా ఉందని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల డిపాజిట్లు గల్లంతు అవుతాయని ఎద్దేవా చేశారు.