Apskilldevelopmenttruth.com Website : చంద్రబాబు కేసులో వాస్తవాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.. వెబ్సైట్ ప్రారంభించిన టీడీపీ
🎬 Watch Now: Feature Video
Published : Sep 15, 2023, 8:08 PM IST
apskilldevelopmenttruth.com : స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికీ ఈ విషయం తెలియాలనే ఉద్దేశంతో వెబ్ సైట్ ఓపెన్ చేశామన్నారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ ట్రూత్ డాట్‌కామ్ వెబ్‌సైట్‌ను పార్టీ సీనియర్ నేతలతో కలిసి ఆయన ప్రారంభించారు. నవంబర్ 2014 నుంచి జరిగిన అన్ని అంశాలు వెబ్ సైట్లో పొందుపరిచామన్న ఆయన.. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై వాస్తవాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.
తెలుగుదేశం సీనియర్ నేతలు apskilldevelopmenttruth.com వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అచ్చెన్నాయుడు, యనమల, నిమ్మల రామానాయుడు, ఇతర నేతలు హాజరయ్యారు. చంద్రబాబుపై అక్రమంగా కేసు పెట్టారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసు (skill development case)లో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలియాలని ఉద్దేశంతో వెబ్ సైట్ ఓపెన్ చేశామని నేతలు తెలిపారు. నవంబర్ 2014 నుంచి జరిగిన అన్ని అంశాలు వెబ్ సైట్ లో పొందుపరిచామన్నారు. ఏపీ కంటే ముందు చాలా రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం అమలైందన్న అచ్చెన్న... ఈ కార్యక్రమం బాగా అమలైందంటూ కేంద్రం అవార్డులు కూడా ఇచ్చిందని గుర్తుచేశారు.
2లక్షల 17వేల 500 మంది యువత ఐదు క్లస్టర్ ల ద్వారా శిక్షణ తీసుకున్నారని వివరించారు. 65 వేల మందికి పైగా యువతకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం పై వాస్తవాలు తెలియజేయాలని వెబ్ సైట్(Website) తీసుకొచ్చిన్నట్లు వెల్లడించారు. చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా అనేకమంది నిరసనకు దిగుతున్నారన్నారు. 380 కోట్లు అవినీతి జరిగిందని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటి నుంచి వైసీపీ పతనం ప్రారంభమైందని అచ్చెన్న తేల్చిచెప్పారు. జూనియర్ ఎన్ఠీఆర్ ఎందుకు స్పందించలేదో ఆయన్ని అడగాలని, ఎవరినీ స్పందించమని తాము అడగమన్నారు. సంబంధం లేని కేసులో ఇరికించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో విజయవాడలో స్వచ్ఛందంగా ఆందోళనలకు దిగారని, రాష్ట్ర విభజన (Division of State) సమయంలో వచ్చినట్లు రోడ్డుపైకి వస్తున్నారని గుర్తుచేశారు. జనసేనతో కలిసి ఎలా ముందుకెళ్లాలనే దానిపై త్వరలో కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఇప్పటికే టీడీపీ దీక్షాశిబిరాలకు జనసేన నేతలు(Janasena Leaders) వచ్చి సంఘీభావం తెలుపుతున్నారని తెలిపారు. పార్టీ నేతలతో చర్చించి సమన్వయ కమిటీ నియామకంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.