"సంబరాల" రాంబాబు సొగసు చూడాల్సిందే! ఈ ఏడాది కూడా తనదైన శైలి నృత్యంతో ఆకట్టుకున్న మంత్రి - అంబటి రాంబాబు డాన్స్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Jan 14, 2024, 10:38 AM IST

Updated : Jan 14, 2024, 12:36 PM IST

AP Minister Ambati Rambabu Dance Bhogi Celebrations : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊరూవాడా సంక్రాంతి  సంబరాలు భోగి మంటలతో ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే వీధుల్లో రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్దారు. దీంతో సందడి వాతావరణం నెలకొంది. భోగిమంటలు, హరిదాసు కీర్తనలు, పొంగళ్లు, రంగవళ్లులు, భోగిపళ్లతో సంబరాలు మన సంస్కృతిని ప్రతిబింభించేలా సాగాయి. రాజకీయ నేతలు ప్రజలతో సంబరాలు జరుపుకోవడం సర్వసాదారణం. ఏపీ మంత్రి గతంలో మాదిరిగానే తనదైన స్టెప్పులతో సంబరాలు జరుపుకున్నారు.

Bhogi Celebrations in Telugu States : ఏపీ మంత్రి అంబటి రాంబాబు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన భోగి వేడుకల్లో నృత్యాలతో మరో మారు సందడి చేశారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్వంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో ఓ సినిమా లోని పాటకు అంబటి  రాంబాబు తనదైన స్టైల్​లో స్టెప్పులు వేశారు. బంజారా మహిళలతో కలిసి హుషారుగా డ్యాన్సులు చేశారు. భోగి వేడుకల్లో నృత్యం చేసేందుకు ప్రత్యేకంగా అంబటి రిహార్సల్స్ కూడా చేయడం కొసమెరుపు. గతంలోనూ ఇదే రీతిలో సంక్రాంతి సంబరాల్లో నృత్యాలు చేసిన అంబటి రాంబాబు మీద విమర్శలు వచ్చాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సైతం "సంబరాల రాంబాబు" అంటూ ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే.

Last Updated : Jan 14, 2024, 12:36 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.