Vegetables at Kg 20 : వ్యాపారి పెద్ద మనసు.. ఏ కూరగాయ కొన్నా కేజీ రూ.20 మాత్రమే - ఇల్లందు మార్కెట్​లో కూరగాయలు 20 రూపాయలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 17, 2023, 5:35 PM IST

Vegetables Kg Rs 20 At Illandu Market : ప్రస్తుతం కూరగాయ రేట్లు ఆకాశాన్ని అంటున్న తరుణంలో.. ఏ కూరగాయలైనా కేజీ రూ.20లకే అమ్ముతూ మంచి మనసు చాటుకుంటున్నారు ఓ వ్యాపారి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని కూరగాయల మార్కెట్​లో ఏ కూరగాయ అయినా రూ.20లకే కేజీ అమ్ముతూ.. అందరి మన్ననలు పొందుతున్నారు. దొండకాయ, వంకాయ, కాకరకాయ, సోరకాయ, బెండకాయ.. ఇలా ఏదైనా రూ.20కే అమ్ముతున్నారు.

గత కొద్ది రోజులుగా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆ ధరల భారం నుంచి పేద ప్రజలను గట్టెక్కించేందుకు ఇల్లందు మార్కెట్​లో ఓ వ్యాపారి ఈ నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ధరలతో పేదలు ఎవరూ ఇబ్బందులు పడకూడదని భావించి.. ఏ కూరగాయనైనా కేజీ రూ.20కి అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు ఉపయోగించుకోవాలని కోరారు. రూ.20కే కేజీ కూరగాయలు వస్తుండటంతో ప్రజలూ పెద్ద ఎత్తున కొంటున్నారు. టమాటాలతో పోటీ పడుతూ పెరుగుతోన్న కూరగాయల ధరల మధ్య రూ.20కే కేజీ కూరగాయలు అందించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.