భారత్​ సైన్యం కోసం 'దక్ష' డ్రోన్- ఇక ఎత్తైన ప్రదేశాల్లో జవాన్లకు ఆహారం, ఔషధాలు మరింత సులువుగా తరలింపు - భారత్ సైన్యం కోసం డ్రోన్ తయారీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Nov 23, 2023, 11:30 AM IST

Updated : Nov 23, 2023, 11:43 AM IST

Anna University Dhaksha Drone : ఎతైన ప్రదేశాల్లో ఉండే సైనికులకు ఆహారం, ఔషధాలను అందించడానికి దక్ష డ్రోన్​ను చెన్నైలోని అన్నా యూనివర్సిటీ పరిధిలోని మద్రాస్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ.. ఏరోనాటిక్స్ విభాగం రూపొందించింది. ఈ డ్రోన్ ట్రయల్​ రన్ కొద్ది రోజుల క్రితం విజయవంతంగా పూర్తైంది.

అన్నా యూనివర్సిటీ పరిధి కింద ఉన్న మద్రాస్ కాలేజ్​ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోనాటిక్స్ విభాగం డైరెక్టర్ సెంథిల్ కుమార్ నేతృత్వంలో ఈ డ్రోన్​ను తయారు చేశారు. ఈ డ్రోన్ ముందుగా​ వ్యవసాయ పొలాల్లో పిచికారీ చేయటం, నదీ పరివాహక ప్రాంతాల్లో మైనింగ్, డ్రైడ్జింగ్ పనులను తనిఖీ చేయడం వంటి కార్యకలాపాల్లో ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఆ తరవాత నవంబరు 15న భారత్-టిబెట్​ సరిహద్దు ప్రాంతంలో సైనికులకు ఆహారం, ముందులను పంపించటం కోసం జరిపిన ట్రయల్స్​లోనూ సక్సెస్ అయింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఈ డ్రోన్ 15 కిలోల పేలోడ్​ను 20 కిలోమీటర్ల దూరం వరకు విజయవంతంగా రవాణా చేసింది. హిమాలయాల వంటి పర్వత ప్రాంతాల్లో సైనికులకు అవసరమైన సామగ్రిని రవాణా చేయటంలో డ్రోన్ ఉపయోగపడుతుంది.  

ఈ దక్ష డ్రోన్​ను అమిత్​ షా.. భారత సైన్యంలోకి ప్రవేశపెట్టారు. అలాగే అదనంగా మరో 500 డ్రోన్​ల రూపకల్పనకు అనుమతిని మంజూరు చేశారు. ఈ డ్రోన్ సక్సెస్​ కావటం వల్ల.. 50 కిలోల వరకు పేలోడ్​ను తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న డ్రోన్​లను తయారు చేస్తామని అన్నా విశ్వ విద్యాలయం పరిధిలోని మద్రాస్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోనాటిక్స్ బృందం తెలిపింది. 

Last Updated : Nov 23, 2023, 11:43 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.