Anganwadi Demands in Adilabad : అంగన్​వాడీల ఆందోళనల్లో ఉద్రిక్తత.. మహిళలపై చేయి చేసుకున్న పోలీసులు - Anganwadi Workers Darna Adilabad Collector Office

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 20, 2023, 4:02 PM IST

Anganwadi Demands in Adilabad : ఆదిలాబాద్​ జిల్లాలో అంగన్వాడీలు చేస్తున్న పదో రోజు ధర్నా ఉద్రిక్తత వాతావరణాన్ని నెలకొంది. కనీస వేతనం, బీమా.. ఇతర డిమాండ్లతో వారు చేస్తున్న సమ్మెను కలెక్టరేట్​ను ముట్టడించేందుకు పిలుపునిచ్చారు. దీంతో జిల్లా నలుమూలల నుంచి అంగ్వాడీ కార్యకర్తలు(Anganwadi workers) భారీగా తరలివచ్చారు. జిల్లా కలెక్టర్​ కార్యాలయం ప్రధాన ద్వారం నుంచి లోనికి వెళ్లేందుకు సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం కాసేపు ఆందోళనకారులకి, పోలీసులకి మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో అంగన్వాడీలంతా ఏకమై స్థానిక ఎస్సైని కొట్టేందుకు ప్రయత్నించగా మరింత ఉద్రిక్తత పరిస్థితులకు దారితీశాయి. 

Anganwadi Workers Darna in Adilabad : అంగన్వాడీలు మరికొంత మంది నాయకులను తరలించి టూటౌన్​ స్టేషన్​ను ముట్టడించేందుకు పరుగులు తీయగా.. వారిని నిలువరించేందుకు డీఎస్పీ వీధి దుకాణంలోని బెల్టును తీయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో అంగన్వాడీలు పోలీస్​ స్టేషన్​ ముందు కూర్చోని నిరసన తెలిపారు. తమ ఆందోళనను పోలీసులు ఆపేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఈ క్రమంలో మగ పోలీసులు మహిళలపై చేయి చేసుకున్నారని అంగన్వాడీ కార్యకర్తల రాష్ట్ర అధ్యక్షురాలు సునీత ఆరోపించింది. ప్రభుత్వం చర్చలకు పిలిచి సామరస్యపూర్వకంగా తమ డిమాండ్​లను పరిష్కరించాలని.. లేనిపక్షంలో ఆందోళనలు మరింత ఉద్రిక్తంగా చేస్తామని హెచ్చరించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.