రేవంత్ రెడ్డి, సీతక్కను కలిసేందుకు భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు ఏపీవాసి కాలినడక - revanthreddy news
🎬 Watch Now: Feature Video
Published : Jan 4, 2024, 7:38 PM IST
Andhra Resident Shekhar Marching to Meet CM Revanth and Minister Sithakka : మంత్రి సీతక్క పేద ప్రజలకు చేస్తున్న సేవ, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఎదిగిన తీరు ఆంధ్రప్రదేశ్‌లోని ఓ యువకుడిని కదిలించింది. వారిద్దర్నీ కలిసేందుకు ఏకంగా భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకూ కాలి నడకన బయలుదేరాడు. తెలంగాణకు రేవంతన్న వచ్చారు, ఆంధ్రాకి చంద్రబాబు రావాలని నినదిస్తున్నాడు. విజయనగరం జిల్లా రాజం మండలానికి చెందిన శేఖర్ వృత్తిరీత్యా తాపీమేస్త్రి. మంత్రి సీతక్క, సీఎం రేవంత్‌రెడ్డిని కలవాలని, డిసెంబర్ 29 ఉదయం భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర మొదలు పెట్టాడు.
సీతక్క, రేవంత్‌రెడ్డి ఎంతో కష్టపడిపైకి వచ్చారని, కరోనా సమయంలో మంత్రి సీతక్క చేసిన సేవ ప్రతి ఒక్కరికి ఆదర్శవంతమైందన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ ఇప్పుడు తెలంగాణ సీఎం అయ్యారని హర్షం వ్యక్తం చేశాడు. ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నవారే అసలైన నాయకులని అలాంటి వారు సీఎం రేవంత్, మంత్రి సీతక్క అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కూడా తదుపరి ముఖ్యమంత్రి చంద్రబాబు అవుతారని శేఖర్ చెబుతున్నాడు.