'బీఆర్ఎస్, బీజేపీలు తెర వెనుక కలిసి పని చేస్తున్నాయి' - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023
🎬 Watch Now: Feature Video
Published : Nov 23, 2023, 7:37 PM IST
Amberpet Congress Candidate Rohin Reddy Interview : కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలోని ఆరు గ్యారంటీలు ప్రజల్లోకి విస్త్రృతంగా వెళ్లాయని.. ఇవే తన గెలుపునకు దోహదం చేస్తాయని అంబర్ పేట్ కాంగ్రెస్ అభ్యర్థి రోహిన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమష్టి కృషితో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అభివృద్ధి పనులు చేయకుండా.. తనని లోకల్ కాదనే ముద్రవేయాలని చూస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రధాని మోదీ వర్కింగ్ ప్రెసిడెంటా అని ప్రశ్నించారు.
తెలంగాణలో కేటీఆర్‌ను సీఎం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్, మోదీని ఎందుకు అడుగుతారని రోహిన్ రెడ్డి నిలదీశారు. బీఆర్ఎస్, బీజేపీ తెర వెనుక కలిసి పోటీ చేస్తున్నాయని ఆరోపించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని.. పథకాలన్ని అమలు చేసి చూపుతామంటున్న అంబర్ పేట్ కాంగ్రెస్ అభ్యర్థి రోహిన్ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.