800 Drones Laser Show : అమరుల స్మారకం చెంత... 800 డ్రోన్లతో అద్భుత ప్రదర్శన - Spectacular Drone Show at Martyrs Memorial

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 22, 2023, 10:53 PM IST

Spectacular Drone Show at Martyrs Memorial : తెలంగాణ అమర వీరులకు.. నిత్య నివాళి స్మారకం ఆవిష్కృతమైంది. తెలంగాణ పరిపాలన కేంద్రమైన అంబేడ్కర్‌ సచివాలయం ముందు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అమర వీరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కొవ్వొత్తుల వెలుగుల‌తో తెలంగాణ అమ‌రవీరులకు... సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు ఘనంగా నివాళులు అర్పించారు. ఆ తర్వాత స్మారకంలోని ఆడియో విజువల్ రూంలో ప్రదర్శించిన లఘు చిత్రాన్ని సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తిలకించారు.

అమరుల స్ఫూర్తి నిత్యం ప్రజ్వరిల్లేలా... హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌ తీరాన అమరజ్యోతిని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం సీఎం కేసీఆర్ అమరుల కుటుంబాలను సన్మానించారు. అనంతరం... తెలంగాణ ప్రగతిపై 800 డ్రోన్లతో నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకే తలమానికంగా ఈ లేజర్ షో నిలిచింది. ఈ ప్రదర్శనను సీఎం కేసీఆర్‌, మంత్రులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. అంతలా ఆకట్టుకుంటున్న ఆ దృశ్యాలను మీరూ చూసేయండి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.