Tech Mahindra : స్కాంలో ఇరుకున్న సత్యం కంప్యూటర్స్‌ను ఛేజిక్కించుకున్న టెక్ మహీంద్రకు శుక్రవారం హైకోర్టులో ఊరట లభించింది. 2002-09 మధ్య సత్యం కంపెనీకి చెందిన వాస్తవ ఆదాయంపైనే ఆదాయపు పన్నును లెక్కించాలంటూ హైకోర్టు తీర్పు నిచ్చింది. కానీ సత్యం కంపెనీ చూపిన ఊహాజనిత ఆదాయం ఆధారంగా పన్ను లెక్కించడం సరికాదని చెప్పింది. సత్యం కుంభకోణం నేపథ్యంలో 2002-09 మధ్య వాస్తవ ఆదాయం ఆధారంగా పన్ను మదింపునకు సీబీడీటీ అనుమతించకపోవడాన్ని టెక్ మహీంద్ర హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ పి.శ్యాంకోశీ, జస్టిస్ ఎన్. తుకారాంజీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. సత్యం మాజీ ఛైర్మన్ రామలింగరాజు లేని ఆదాయాన్ని చూపారని తెలిపింది. దాని ఆధారంగా పన్ను చెల్లించాలనడం సరికాదని ధర్మాసనం తేల్చి చెప్పింది. టెక్ మహీంద్ర వాదనతో ధర్మాసనం ఏకీభవించింది.
అలా పన్ను చెల్లించాలనడం సరికాదు - టెక్ మహీంద్రకు హైకోర్టులో ఊరట - TECH MAHINDRA RELIEF HC
టెక్ మహీంద్రకు హైకోర్టులో ఊరట - స్కాంలో ఉన్న సత్యం కంప్యూటర్స్‌ను ఛేజిక్కించుకున్న టెక్ మహీంద్ర
Published : Feb 1, 2025, 10:37 AM IST