Allu Arjun in Nalgonda : నల్గొండ జిల్లాలో అల్లుఅర్జున్ సందడి.. గజమాలతో గ్రాండ్ వెల్కమ్ చెప్పిన ఫ్యాన్స్ - Allu Arjun latest news
🎬 Watch Now: Feature Video
Allu Arjun at Kothagudem : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు నల్గొండ జిల్లాలో సందడి చేశారు. తన మామయ్య, బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నూతనంగా నిర్మించిన ఓ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి బన్నీ.. తన భార్య, పిల్లలతో కలిసి హాజరయ్యారు. జిల్లాలోని పెద్దవూర మండలం కొత్తగూడెంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగగా.. విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కొందరు అభిమానులు గజమాలతో ఆయనను సన్మానించారు. తమ అభిమాన నటుడిని చూసేందుకు అభిమానులు పోటీపడగా.. కాసేపు అక్కడ తోపులాట జరిగింది. ఆ సమయంలో బన్నీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది వారిని నియంత్రించలేకపోయారు. అనంతరం అల్లుఅర్జున్.. అభిమానులకు అభివాదం చేస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రారంభోత్సవ అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. కార్యక్రమంలో మాట్లాడిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి.. నాగార్జున సాగర్ నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.