Advocate Luthra Mention Navlakha Case For Chandrababu House Arrest: నవలఖా కేసును ప్రస్తావించిన లూథ్రా.. నేడు తీర్పు - Verdict on Naidu house arrest today
🎬 Watch Now: Feature Video
Published : Sep 12, 2023, 9:22 AM IST
Advocate Luthra Mention Navlakha Case For Chandrababu House Arrest : చంద్రబాబును హౌస్‌అరెస్ట్‌కు అనుమతివ్వాలంటూ ఆయన తరఫు న్యాయవాది లూథ్రా మానవ హక్కుల కార్యకర్త గౌతం నవలఖా కేసును ఉదహరించారు. ఈ కేసు నేపథ్యం ఏంటంటే.. 2017 డిసెంబరులో పుణెలో నిర్వహించిన ఎల్గార్ పరిషద్ సమావేశంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన మానవ హక్కుల కార్యకర్త గౌతం నవలఖాపై కేసు (Navlakha Case) నమోదైంది. 2021 ఏప్రిల్‌లో ఆయన లొంగిపోయారు. అనంతరం ఆయన్ను ముంబయిలోని తలోజీ సెంట్రల్ జైలుకు తరలించారు. తన వయసు, అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని హౌస్ కస్టడీ (House Custody) విధించాలని నవలఖా హైకోర్టును ఆశ్రయించారు. ఆయనకు అక్కడ చుక్కెదురైంది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన వయసు, అనారోగ్యం రీత్యా ముంబయిలో హౌస్ కస్టడీలో ఉండేందుకు షరతులతో అనుమతించింది.
నేడు తీర్పు : గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు ముంబయి వదిలి వెళ్లరాదని బయటి వారితో మాట్లాడటం, కంప్యూటరు, ఇంటర్నెట్ వాడరాదని స్పష్టం చేసింది. ఇంటర్నెట్ లేని ఫోన్ మాత్రం రోజుకు పది నిమిషాల పాటు పోలీసుల సమక్షంలో వాడుకోవచ్చనే షరతులు విధించింది. టీవీ, వార్తా పత్రికలకూ అనుమతిచ్చిన కోర్టు.. ఆయన ఉన్న ప్రాంతాన్ని సీసీ కెమెరాలతో పర్య వేక్షించుకోవచ్చని పోలీసులకు ఆదేశించింది. తాజాగా చంద్రబాబుకు హౌస్ కస్టడీని కోరుతున్న న్యాయవాదులు.. నవలఖా కేసును ఉదహరిస్తున్నారు. చంద్రబాబు హౌస్ అరెస్టుపై న్యాయస్థానం నేడు తీర్పు (Chandrababu house Custody Judgement Today) వెలువరించనుంది.
TAGGED:
Chandrababu House Custody