Adjournment of Hearing on CID Call Record Petition: సీఐడీ అధికారుల కాల్‌డేటా పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా - Chandrababu Arrest news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-10-2023/640-480-19865000-thumbnail-16x9-acb.jpg)
![ETV Bharat Telugu Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Oct 26, 2023, 8:03 PM IST
Adjournment of Hearing on CID Call Record Petition: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసిన సమయంలో అక్కడున్న సీఐడీ అధికారుల కాల్‌డేటా రికార్డు కావాలని కోరుతూ.. దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా పిటిషన్‌పై సీఐడీ అధికారులు కౌంటరు దాఖలు చేశారు. దాంతో తదుపరి విచారణను న్యాయస్థానం శుక్రవారానికి వాయిదా వేస్తూ.. ఆదేశాలు జారీ చేసింది.
Petition on Call Data of CID Officials: నంద్యాల జిల్లాలో గత నెల (సెప్టెంబర్) 9వ తేదీన ఏపీ సీఐడీ పోలీసులు చంద్రబాబు నాయుడ్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ మేరకు చంద్రబాబు అరెస్టు చేసే సమయానికి ముందు.. సీఐడీ అధికారులు పలువురిని ఫోన్ ద్వారా సంప్రదించారని, ఆ వివరాలు తెలిస్తే అరెస్టులో కీలక విషయాలు బయటపడతాయని.. చంద్రబాబు తరఫు న్యాయవాది విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన న్యాయస్థానం.. నేడు మరోసారి విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్టు సమయంలో సీఐడీ కాల్‌డేటా పిటిషన్‌పై సీఐడీ తరుఫు న్యాయవాదులు.. కౌంటర్ దాఖలు చేశారు. అనంతరం కేసు విచారణను రేపటికి వాయిదా వేస్తూ.. ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.