Hyderabad Girl on Powerlifting : పవర్ లిఫ్టింగ్‌లో రాణిస్తున్న యువతి.. ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యమంటున్నశ్రుతి - A young girl Hyderabad excels in powerlifting
🎬 Watch Now: Feature Video
Hyderabad Girl Excels in Powerlifting : అచంచల ఆత్మవిశ్వాసానికి నిరంతరం కష్టపడే తత్వం తోడైతే.. జాతీయ, అంతర్జాతీయ క్రీడా వేదికలపై రాణించవచ్చని చెబుతోంది ఆ యువతి. అమ్మాయిలకు అవకాశాలు కల్పించాలే గానీ ఏదైనా సాధించగలరని నిరూపిస్తోంది. ఓ వైపు చదువు కొనసాగిస్తూనే మరోవైపు తనకు ఇష్టమైన పవర్ లిఫ్టింగ్‌లో రాణిస్తోంది. అమ్మాయిలు అరుదుగా ఎంచుకునే ఈ క్రీడలో ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోందీ. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పతకాల పంట పండిస్తూ ఔరా అనిపిస్తోంది. ఆమె హైదరాబాద్ కాచిగూడకు చెందిన యువతి శ్రుతి. దృఢంగా ఉండేందుకు పవర్ లిఫ్టింగ్ ఉపయోగపడుతోందని చెబుతోంది. నచ్చిన రంగంలో ప్రోత్సహిస్తే యువత అద్భుతాలు చేస్తారని అంటోంది. గత సంవత్సరం నవంబర్ 24 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు న్యూజిలాండ్‌లో జరిగిన కామన్‌వెల్త్ క్రీడల్లో.. 407 కిలోల బరువెత్తి బంగారు పతకంను సాధించింది. మరి తన ప్రయాణం ఎలా సాగింది.? ఏఏ పోటీల్లో పతకాలు సాధించింది. తన లక్ష్యం ఏంటి.? అనే విషయాలను శ్రుతి మాటల్లోనే విందాం.