Saree in Matchbox: వేములవాడ రాజేశ్వరి అమ్మవారికి అగ్గిపెట్టలో చీర - నేత కార్మికుడు
🎬 Watch Now: Feature Video
Saree in Matchbox For Goddess Rajarajeshwari in Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరి అమ్మవారికి నేత కార్మికుడు నల్ల విజయ్ రెండు గ్రాముల బంగారంతో అగ్గిపెట్టెలో ఇమిడేలా తయారు చేసిన చీరను బహుకరించారు. విజయ్ తరచుగా అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి.. రాష్ట్రంలోని అమ్మవార్లకు కానుకగా సమర్పిస్తూ ఉంటారు. ఇటీవలే విజయవాడ కనకదుర్గమ్మకు కూడా కానుక సమర్పించారు. తాజాగా వేములవాడ రాజేశ్వరి దేవికి బహుమానం అందించారు.
సిరిసిల్లకు చెందిన నల్ల విజయ్ వారసత్వంగా నేత పనిని కొనసాగిస్తూ వస్తున్నారు. తన తండ్రి గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే చీరలను నేసి ఆలయాలు, ప్రజాప్రతినిధులకు బహుకరించే వారు. ఆ వారసత్వాన్ని తాను కొనసాగించాలనే ఉద్దేశంతో తాను కూడా ఈ చీరలను ఆలయాలకు బహుకరిస్తున్నట్లు నల్ల విజయ్ తెలిపారు. రెండు గ్రాముల బంగారంతో అగ్గిపెట్టెలో ఇమిడేలా ఈ చీరను తయారు చేశానని చెప్పారు. గతంలో తాను మొదటగా తిరుమల తిరుపతి దేవస్థానంలో.. తర్వాత విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో బంగారంతో నేసిన చీరలను బహుకరించినట్టు తెలిపారు. అందులో భాగంగా వేములవాడ ఆలయంలోనూ ఈ చీరను బహుకరిస్తున్నట్లు తెలిపారు.