మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం.. బైక్‌తో సహా కాలువలో పడ్డ వ్యక్తి.. లక్కీగా.. - కాలువలో పడ్డ వ్యక్తి
🎬 Watch Now: Feature Video
Biker Fell In Drainage : ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువకుడు.. బైక్‌తో సహా మురికి కాలువలో పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అతడిని ప్రాణాలతో కాపాడారు. పంజాబ్‌లోని లుధియానాలో ఈ ఘటన జరిగింది.
అసలేం జరిగిందంటే?
లుధియానాలోని కోట్ మంగళ్ సింగ్ నగర్ ప్రాంతంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు.. మురికి కాలువ నిర్మాణ పనులు చేపట్టారు. పనులు ముగిసి చాలా రోజులైనా పైన మూత వేయలేదు. అయితే శుక్రవారం రాత్రి.. మసాన్ బాచి జాన్ అదే ప్రాంతానికి బైక్‌పై వెళ్లాడు. ప్రమాదవశాత్తు మురికి కాలువలో ద్విచక్ర వాహనంతో సహా పడిపోయాడు.
మసాన్ పడిపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. యువకుడిని బయటకు లాగారు. కాలువ లోతుగా ఉండడం వల్ల మోటార్ సైకిల్ లోపలికి వెళ్లిపోయింది. తాళ్ల సహాయంతో బైక్‌ను బయటకు తీశారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లే యువకుడు.. మురికి కాలువలో పడిపోయాడని స్థానికులు అంటున్నారు. వెంటనే కాలువపై మూత ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మసాన్.. పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడని అన్నారు. మురికి కాలువ తెరిచి ఉండడం వల్ల ఓ వైపు రోగాలు వస్తున్నాయని.. మరోవైపు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరారు.