7 world records : 7 ఏళ్ల బాలిక.. 77 దీపాలతో నృత్యం.. 7 ప్రపంచ​ రికార్డులు - హైదరాబాద్​ వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 11, 2023, 12:48 PM IST

7 years Girl won 7 world records : 77 దీపాలతో ఒకేసారి నృత్యం చేయడం చూశారా అది కూడా 7 కేజీల బరువు గలది. ఈ 7 ఏళ్ల అమ్మాయి అలవోకగా నృత్యం చేసి అందరిని ఆకట్టుకుంది. ఈ నృత్య ప్రదర్శన చేసి ఏకంకా 7 భారత వరల్డ్ రికార్డ్స్ సాధించింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు..? గెలిచిన రికార్డులు ఏంటి..? తాను చేసిన నృత్య ప్రదర్శన చూసేయండి...

ఏడు కేజీల బరువు కలిగిన దీపాన్ని తలపై ఎత్తుకొని ఏడేళ్ల బాలిక ప్రదర్శించిన నృత్యం అందరిని తన వైపు ఆకట్టుకుంది. అవని నృత్యాలయ సమర్పణలో కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ, ఏడేళ్ల బాలిక చేసిన కూచిపూడి నృత్యానికి ఏడు భారత్ వరల్డ్ రికార్డులు దక్కాయి. హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో సంజీవరెడ్డి, శిరీషల కుమార్తె కియారెడ్డి  77 కుందులతో ఏడు కేజీల బరువు కలిగిన దీపాన్ని తలపై ఎత్తుకొని అలవోకగా అందరిని ఆకట్టుకునేలా నృత్యం చేశారు. 

ఏడు నిమిషాల నిడిమితో ప్రదర్శించిన నృత్యానికి భారత వరల్డ్ రికార్డ్ అధ్యక్షులు డాక్టర్ సి.వి.రమణారావు  ఏడు భారత వరల్డ్ రికార్డ్స్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద హాజరై భారత వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్న కియారెడ్డినీ అభినందించారు. ఈ సందర్భంగా,  కియారెడ్డినీ అవార్డులు అందజేసి ఘనంగా సత్కరించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.