600 Crore Diamond Ganesh : ఆయన ఇంట్లో రూ.600కోట్ల డైమండ్ గణపతి.. కోహినూర్ కంటే పెద్దది.. ఏడాదికి ఒక్కరోజే పూజలు - సూరత్ వజ్రాల గణపతి విగ్రహం వీడియో
🎬 Watch Now: Feature Video
Published : Sep 22, 2023, 4:53 PM IST
600 Crore Diamond Ganesh In Gujarat : గుజరాత్ సూరత్లోని ఓ వజ్రాల వ్యాపారి ప్రపంచంలోనే అత్యంత అరుదైన డైమండ్ గణపతికి పూజలు చేస్తున్నారు. 182.3 క్యారెట్లతో 36.5 గ్రాముల బరువు ఉన్న ఈ వజ్ర గణపతిని ఏడాదికి ఒక్కరోజు మాత్రమే బయటకు తీస్తున్నారు కనుభాయ్ అసోదరియా అనే వ్యాపారి. భక్తులకు కూడా దీన్ని చూసేందుకు అనుమతిస్తారు. సైజులో ఇది కోహినూర్ కంటే పెద్దగా ఉండటం విశేషం. ఈ వజ్రం ధర గురించి కనుభాయ్ వెల్లడించకపోయినా.. మార్కెట్లో దీని విలువ రూ.600 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.
Ganesh Idol Blessings To Devotees : లేచి నిలబడి భక్తులను ఆశీర్వదిస్తున్న వినాయకుడు!.. ఎక్కడో తెలుసా?
వజ్రాల వ్యాపారి అయిన కనుభాయ్ 15 ఏళ్ల క్రితం వ్యాపారం నిమిత్తం బెల్జియంలో పర్యటించారు. ఆ సమయంలో ముడి వజ్రాలను భారత్కు తీసుకొచ్చారు. అయితే, అందులోని ఒక వజ్రం గణపతి ఆకారంలో ఉన్నట్లు కనుభాయ్ తండ్రికి కల వచ్చింది. తర్వాత వజ్రాన్ని గమనించేసరికి.. అందులో వినాయకుడి ఆకారం కనిపించింది. అప్పటి నుంచి ఈ డైమండ్ విఘ్నేశ్వరుడికి కనుభాయ్ కుటుంబం పూజలు చేస్తోంది. ఈ గణపతిని ఎవరికీ ఇవ్వనని కనుభాయ్ చెబుతున్నారు. ఇది పూర్తిగా ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన వజ్రమని తెలిపారు. అత్యంత ప్రత్యేక ఆకారంలో ఉన్న వజ్రంగా దీనికి గిన్నిస్ రికార్డు సైతం లభించింది. ఈ డైమండ్ గణపతి ఫొటోలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, యోగా గురువు రామ్దేవ్ బాబా వంటి ప్రముఖులకు అందించారు కనుభాయ్.
Vande Bharat Train Ganesh Idol : వందేభారత్ రైలు నమూనాలో గణేశుడు.. 'మేక్ ఇన్ ఇండియా' స్ఫూర్తితో..