ఓటు హక్కుపై అవగాహనకు 400 చదరపు అడుగుల రంగోలీ - భోపాల్ 400 చదరపు అడుగుల రంగోలీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Nov 16, 2023, 5:16 PM IST

400 Square Feet Rangoli Voting : మధ్యప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేలా ప్రజలను ప్రోత్సహించడానికి 400 చదరపు అడుగుల రంగోలిని రూపొందించారు. శుక్రవారం జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధిక సంఖ్యలో ప్రజలను ఓటేసేలా చేసేందుకు భోపాల్‌ జిల్లా యంత్రాంగం ఈ ప్రయత్నం చేసింది. ఇందుకోసం స్థానిక కళాకారులను పిలిపించింది. ఓటింగ్​ శాతం భారీగా నమోదు చేయాలన్న లక్ష్యంతో ఈ రంగోలిని వేయించారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును విధిగా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం పిలుపునిచ్చింది. 

"ఇది 400 చదరపు అడుగుల రంగోలి. దీనిని వేయడానికి మేము ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నారింజ రంగులను ఉపయోగించాం. దీపావళిని జరుపుకున్నట్లే.. ఓట్ల  పండగ జరుపుకోవాలి. మేము ఓటు ఎలా వేయాలో ఈ చిత్రం ద్వారా చెప్పాం. ఓటింగ్​లో వివిధ ప్రక్రియలను చూపించాం. వికలాంగులు ఓటు హక్కు ఎలా ఉపయోగించుకోవాలో.. ప్రజలు యాప్​ను ఉపయోగించి సురక్షితంగా ఎలా ఓటు వేయవచ్చో మా రంగోలి ద్వారా చూపించాం."
-ధర్మేంద్ర ప్రధాన్, చిత్ర కళాకారుడు

Madhya Pradesh Elections Family Battle : మామాఅల్లుళ్లే ప్రత్యర్థులు.. బావామరదళ్ల మధ్య ఢీ.. పరి'వార్'​లో విజయమెవరిదో?

Madhya Pradesh Bundelkhand Election : అభివృద్ధితో బీజేపీ.. కులగణనతో కాంగ్రెస్.. అధికారాన్ని కట్టబెట్టే బుందేల్​ఖండ్ ఎవరివైపు

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.