ఇన్స్టాగ్రాం ద్వారా పరిచయమైన అబ్బాయిలను కలిసేందుకు తొమ్మిదో తరగతి అమ్మాయిల ప్లాన్ - అమ్మాయి మిస్సింగ్ వార్తలు
🎬 Watch Now: Feature Video


Published : Dec 28, 2023, 8:03 PM IST
4 Girls Missing In Adilabad : ఇంటి నుంచి చెప్పా పెట్టకుండా బయటకు వెళ్లిన తొమ్మిదో తరగతి చదివే నలుగురు బాలికలను నిజామాబాద్ జిల్లాలో పట్టుకున్నట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం వడ్డాడిలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమం పరిశీలించిన ఎస్పీ కలకలం రేపిన బాలికల అదృశ్యం ఉదంతం గురించి వివరించారు. ఆదిలాబాద్ పట్టణం దోభీ కాలనీకి చెందిన నలుగురు బాలికలు స్థానికంగా ఉన్న జడ్పీహెచ్ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. రోజు మాదిరి బడికి వెళ్తున్నామని ఇంట్లో చెప్పి పాఠశాలకి ఎగనామం పెట్టి ఇన్స్టాగ్రాం ద్వారా పరిచయం అయిన అబ్బాయిలతో పరారయ్యే ప్రణాళిక రచించారు.
Four Girls Caught Police In Nizamabad District : ఈ క్రమంలో వారంతా బస్సు ద్వారా నిజామాబాద్ చేరుకున్నారు. పాఠశాలకు వెళ్తున్నామని చెప్పి ఇంటికి రాలేదు. కుమార్తెల ఆచూకీ కోసం తల్లిదండ్రులు మావల పోలీసులను ఆశ్రయించారు. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఎస్పీ రంగంలోకి దిగి ప్రత్యేక బలగాలతో బాలికల ఆచూకీ కనుగొన్నారు. వారిని తల్లి తండ్రులకు అప్పగించినట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.