కళ్లు తిప్పుకోలేని అందాలు.. కైపెక్కించే క్యాట్‌వాక్‌లు - విజయవాడ నోవెటెల్లో ఫ్యాషన్ షో
🎬 Watch Now: Feature Video

కళ్లు తిప్పుకోలేని అందాలు.. కైపెక్కించే క్యాట్‌వాక్‌లతో అతివలు కేకపుట్టించారు. విజయవాడ నోవాటెల్‌లో నిర్వహించిన మిస్టర్ అండ్ మిస్ ఏపీ తుది పోటీల్లో మోడల్స్ క్యాట్‌వాక్ చేస్తూ... కనువిందు చేశారు. వీనుల విందైన సంగీతానికి అనుగుణంగా వేదికపై వయ్యారాలు ఒలకబోశారు. అలకనంద ప్రజెంట్స్ ఆధ్వర్యంలో గతంలో నిర్వహించిన ఆడిషన్స్‌లో ఎంపికైన 12 మంది బాలురు, 12 మంది బాలికలు, మిసెస్ విభాగంలో 20 మంది, మిస్టర్స్‌లో 16 మంది తుది పోటీల్లో పాల్గొన్నారు. వివిధ రౌండ్లలో పాల్గొని తమ ప్రతిభను చాటారు. యువతలో దాగిన ప్రతిభను వెలికితీయడానికి ఈ ప్రయత్నం చేసినట్టు నిర్వాహకులు సతీశ్ అడ్డాల తెలిపారు. కొవిడ్ బారినపడిన వారిని ఆదుకోడానికి తమవంతు సాయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ముఖ్య అతిధిగా రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్, నటులు విజయమూర్తి, దీపనాయుడు తదితరులు పాల్గొన్నారు.
Last Updated : Dec 19, 2020, 12:30 PM IST