బాత్రూంలో 11 అడుగుల కింగ్ కోబ్రా.. స్థానికులు హడల్! - కర్ణాటక శివమొగ్గ కింగ్ కోబ్రా
🎬 Watch Now: Feature Video
king cobra in shivamogga: కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా కేరెకొప్ప గ్రామంలో సోమవారం ఓ కింగ్ కోబ్రా కలకలం సృష్టించింది. అనంద్ గాయకర్ అనే వ్యక్తి ఇంటి బాత్రూంలో 11 అడుగుల కోబ్రా ఉన్నట్లు గుర్తించి.. స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించాడు. భారీ కోబ్రా వచ్చిందని తెలిసి చుట్టుపక్కల వారు కూడా భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్లు పామును పట్టేందుకు ప్రయత్నించగా ఆ భారీ కోబ్రా దాడికి యత్నించింది. మొత్తానికి అరగంట పాటు శ్రమించి కోబ్రాను పట్టుకున్నాక గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. పామును సమీపాన ఉన్న అడవుల్లోకి వదిలేశారు.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST