సముద్ర గర్భంలో యోగా.. ఇదే సరికొత్త ట్రెండ్​!

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 3, 2021, 5:52 PM IST

కరోనా కారణంగా గత 18 నెలలుగా యావత్​ ప్రజానీకం తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. ఈ సమస్య పరిష్కారానికి ఓ సరికొత్త ఆలోచన చేసింది.. ఉత్తర అమెరికాలోని సెయింట్​ లూసియా దేశంలోని విండ్​జామెర్​ ల్యాండింగ్​ విల్లా బీచ్​ రిసార్ట్​​. నీటి అడుగున యోగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కరీబియన్​ సముద్రంలో 20 అడుగుల లోతులోకి పర్యటకులను పంపి.. కొంత సమయం పాటు యోగాసనాలు వేయిస్తోంది. అండర్​ వాటర్​ యోగాకు ఆ ప్రాంతంలో మంచి ఆదరణ లభిస్తోంది. ఇందులో పాల్గొనేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. దీని ద్వారా మానసికంగా, శారీరకంగా ఎంతో ఉపశమనం లభిస్తుందని, గుండె వేగం, బీపీ తగ్గుతుందని చెబుతున్నారు నిర్వాహకులు. కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ సేవలందిస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.